నాలుగు కారిడార్లలో విశాఖ మెట్రో…!

-

విశాఖలో మెట్రో కారిడార్ ఏర్పాటు పై ప్రభుత్వం దూకుడు పెంచింది. 75 కిలోమీటర్ల పొడువుతో నాలుగు కారిడార్లతో నిర్మించాలని ప్రాధమికంగా నిర్ణయించింది. అవసరమైతే మరోసారి క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలనే అభిప్రాయానికి వచ్చింది. మెట్రో నిర్మాణంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష చేశారు.


విశాఖ మెట్రో దారి మొత్తం దాదాపుగా ఎలివేటెడ్‌గానే.. 75 కిలోమీటర్ల పొడవుతో నాలుగు కారిడార్లతో ఉండనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ – కొమ్మాడి జంక్షన్ వరకు.. గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీసు.. తాడిచెట్లపాలెం- చిన వాల్తేర్ , కొమ్మాడి జంక్షన్ – భోగాపురం వరకు నాలుగు కారిడార్లలో మెట్రోరైల్ లైన్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. నిర్దేశించిన కారిడార్లలో ఎక్కడెక్కడ స్టేషన్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది, నిర్వహణ సౌలభ్యం ఎలా? అనే విషయాల్లో తుది అంచనాలకు వచ్చే ముందు అవసరమనుకుంటే మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నివేదిక సిద్ధం చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version