అధికారం చేపట్టిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే తాను ఎన్నికల సమయంలో, పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తున్నారు. అప్పులు చేస్తున్నారని విపక్షాలు అంటున్నా ప్రజలకు అందాల్సిన ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా జగన్ వాయిదా వేయటం లేదు.
అందుకోసం పలు ఆదాయ మార్గాలను కూడా ఆయన అన్వేషిస్తున్నారు. రైతు భరోసా, అమ్మఒడి, వాహన మిత్ర వంటి కీలక పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారు. అదే విధంగా తాజాగా మరో పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. అదే జగనన్న గోరుముద్ద. ఈ పథకం ద్వారా మధ్యాహ్న భోజన పథకం లో ప్రభుత్వం మెనూ మార్చి రోజుకో రకమైన మెనూతో మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతోంది.
దీనిపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, రోజు పప్పు లేదా పప్పు చారు తినే వారని, ఇప్పుడు మంచి భోజనం తింటున్నారని, వారికి ఆరోగ్యకరమైన ఆహారం నాణ్యంగా అందుతుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎలాగో అలాంటి ఆహారం తమ పిల్లలకు పెట్టలేదని, కానీ ముఖ్యమంత్రి జగన్ తన పెద్ద మనసుతో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తమ పిల్లలకు మంచి భోజనం అందిస్తున్నారని అంటున్నారు.
ఇప్పటివరకు మధ్యాహ్న భోజన పథకం అంటే ఒక అభిప్రాయం ఉండేదని… జగనన్న గోరుముద్ద పథకంతో ఆ అభిప్రాయం మార్చేసారు అనే భావన తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు బడి మొహం చూడని పిల్లలు కూడా ఇప్పుడు ఇలాంటి పథకాలతో స్కూల్ కి వెళ్తున్నారు అని పేర్కొనడం విశేషం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే ఈ పథకం కొనసాగించాలని కోరుతున్నారు తల్లి తండ్రులు.