రంజాన్ వేళ ముస్లింలకోసం ఏపీ సర్కార్ నిర్ణయాలివి!

-

మామూలుగా రంజాన్ మాసం అంటే ముస్లింలకు అతి పెద్ద పండగ! ఈ సీజన్ లో అన్ని రోజులూ… ప్రతీ రోజూ ఒక కొత్త పండగలానే వారు జరుపుకుంటారు. అత్యంత నిష్టతో ఈ పవిత్రమాసాన్ని వారు పాటిస్తారు. ఈ క్రమంలో లాక్ డౌన్ పుణ్యమాని కనీసం మసీదులో ప్రార్ధనలు చేసుకునే అవకాశం కూడా లేని పరిస్థితి. ఈ విషయంలో హిందూ, ముస్లిం, క్రీస్టియన్ అనే తారతమ్యాలు ఏమీ లేవు… ఈ ఏడాది అందరి పరిస్థితీ ఇదే. ఈ క్రమంలో రంజాన్ మాసంలో ముస్లింలకు ప్రత్యేక సడలింపులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

రంజాన్‌ నేపథ్యంలో ఏపీ సర్కార్ తీసుకునే ప్రత్యేక చర్యల్లో భాగంగా… రంజాన్ మాసంలో ప్రత్యేక సడలింపులు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా… మసీదులో ప్రార్థనలకు ఇమామ్, మౌజంతో పాటు మరో ముగ్గురికి అనుమతి కల్పించింది. అదేవిదంగా 24 గంటల విద్యుత్, అవసరానికి సరిపడా మంచినీటి సరఫరాలు కూడా చేయనుంది. ఇదే క్రమంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్ల షాపులకు ఉదయం 10 గంటల వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇఫ్తార్‌ కు అనుగుణంగా సాయంత్రం పూట డ్రై ఫ్రూట్ షాపులకు కూడా ప్రత్యేక అనుమతి కల్పించింది.

ఇందులో భాగంగా…. హోటల్స్‌ను గుర్తించి ఇఫ్తార్, సెహ్రి సమయాల్లో పార్శిల్స్‌ కు అనుమతి ఇవ్వడంతోపాటు.. ఇమామ్‌, మైజింలకు పాసులు కూడా జారీ చేయనుంది. ఈ సందర్భంగా… ఇచ్చిన ప్రత్యేక అనుమతులు, సడలింపులను మిస్ యూజ్ చేయకుండా… సక్రమంగా వినియోగించుకుని… ప్రభుత్వ ఆదేశాలను పాటించి.. ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. సాయంత్రం పూట డ్రై ఫ్రూట్ షాపుల వద్ద కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం మరిచిపోవద్దని సూచిస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version