మాజీ మంత్రి అంబటి రాంబాబు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో అంబటిపై భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఇప్పటికే టీడీపీ నేతలు పలు మీడియా సమావేశాలలో పేర్కొన్నారు. జగనన్న కాలనీల కోసం భూములను ఎకరం రూ.10 లక్షలకు కొని ప్రభుత్వానికి రూ.30 లక్షలకు అమ్మినట్లు గుర్తించారట అధికారులు.

విద్యుత్ కేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు రూ.7 లక్షలకు అమ్మకాలు జరిపినట్లు చెబుతున్నారు.
అంబటి అవినీతి ఆరోపణలపై విచారణ చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. విజిలెన్స్ నివేదికలో అక్రమాలు తేలితే కేసును ఏసీబీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ తరుణంలోనే… మాజీ మంత్రి అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.