హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. నిమజ్జన వేడుకలో పాల్గొన్న యువత… కేసీఆర్ పాటలు పెద్ద ఎత్తున ప్లే చేసి సందడి చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా బైక్‌లపై గుంపులుగా వచ్చిన యువకులు ర్యాలీగా సెక్రటేరియట్ దారి పట్టారు.ఈ క్రమంలో కేసీఆర్ ప్రచార గీతాలు అయిన “దేఖ్లేంగే” పాట గట్టిగానే వినిపించింది.

ఈ పాటకు తాళం వేసుకుంటూ కొంతమంది యువతులు నృత్యం కూడా చేశారు. వినాయక నిమజ్జనం మతపరమైన వేడుక అయినప్పటికీ, ట్యాంక్‌బండ్ వద్ద రాజకీయ వాతావరణాన్ని తలపించేలా కేసీఆర్ పాటలు వినిపించాయి. గత సంవత్సరం వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా… ఇలాగే కేసిఆర్ పాటలతో రచ్చ చేశారు హైదరాబాద్ యువత. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఇలా వ్యవహరిస్తున్నారు.
ట్యాంక్ బండ్ మొత్తం కేసీఆర్ పాటలతో.మార్మోగుతుంది 🔥🔥🔥 pic.twitter.com/wtG2Dje9sn
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) September 4, 2025