కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై గులాబీ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు స్పందించలేదు. ఇటీవల విదేశాలకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు.. తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావును…. కల్వకుంట్ల కవిత కామెంట్లపై రియాక్షన్ ఏంటి? అని మీడియా సభ్యులు అడిగే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించలేదు.

ఆమెపై కాస్త సీరియస్ గా ఉన్న హరీష్ రావు… తర్వాత ప్రెస్ మీట్ పెట్టే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే హరీష్ రావు పై కామెంట్స్ చేసిన కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి బయటకు పంపించారు గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు. అటు దానికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ అలాగే ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత కూడా రాజీనామా చేశారు. దీంతో గులాబీ పార్టీలో చీలిక ఏర్పడింది.