మరోసారి తెరపైకి శాంతి, విజయసాయి రెడ్డి ఎపిసోడ్ వచ్చింది.. దేవాదాయ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిపై చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అయింది. శాంతిపై వచ్చిన ఆరోపణల మేరకు గతేడాది జులైలో సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం.

విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో శాంతిపై వచ్చిన ఫిర్యాదులపై దేవాదాయ శాఖ కమిషనర్ నివేదికలు చేసింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించారని, కింది స్థాయి అధికారుల సిఫారసులు లేకుండానే ఆలయ భూములను ఇష్టానుసారం లీజుకు ఇచ్చారని నివేదికల్లో తెలిపారు విచారణాధికారులు.