నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

-

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్స్‌ని ర్యాగింగ్ చేసి దారుణంగా కొట్టారు సీనియర్స్. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుండి విద్యార్థి రాహుల్ రెడ్డిని ర్యాగింగ్ చేశారు సీనియర్స్..ఐన భరిస్తూ వచ్చాడు విద్యార్థి. సీనియర్స్ ఇంటర్న్‌షిప్ చేస్తూ అదే కాలేజీలో ఉండి, రాహుల్ రెడ్డిని నాలుగో సంవత్సరంలో కూడా ర్యాగింగ్ చేసారు.

Raging stir at Nizamabad Government Medical College
Raging stir at Nizamabad Government Medical College

రాహుల్ రెడ్డి పోస్టింగ్‌కు వెళ్ళినా ఆబ్సెంట్ వేసాడు సీనియర్ విద్యార్థి సాయిరాం పవన్. దీనిపై మాట్లాడడానికి వెళ్తే ఒక రూంలోకి పిలిచి రాహుల్ రెడ్డిపై దాడి చేసారు 10 మంది సీనియర్లు.
జాండిస్ వచ్చిందని రిపోర్టులు చూపించినా వదలకుండా ర్యాగింగ్ చేసారు సీనియర్ విద్యార్థులు. దాడికి పాల్పడ్డ సీనియర్ హౌస్ సర్జన్స్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని జూనియర్ మెడికోలు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news