మేడిపల్లి హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వాతిని చంపేందుకే వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన మహేందర్ రెడ్డి… ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిపై అనుమానం పెంచుకున్నాడు. స్వాతి గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం పెంచుకున్నాడు. తాము ఉంటున్న ఇంటి యజమానులు నిన్న లేకపోవడంతో హత్యకు ప్లాన్ చేసాడు మహేందర్.

స్వాతిని చంపేసి శరీర భాగాలను ముక్కలుగా చేసిన మహేందర్… కాళ్లు, చేతులు, తల భాగాలను విడివిడిగా చేసి ఛాతీ భాగాన్ని మాత్రం కట్ చేయకుండా ఉంచాడు. భార్యను చంపి.. కాళ్లు, చేతులు, తల భాగాలను తీసుకెళ్లి మూసీలో పడవేసిన అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు మహేందర్. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్వాతి మృతదేహాల భాగాలు లభించలేదు.