ఏపీ స‌ర్కార్‌పై స్పెష‌ల్ టార్గెట్‌… తెర వెన‌క ఏం జ‌రుగుతోంది..!

-

“ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు“- ఓ ఆంగ్ల మీడియాలో క‌థ‌నం హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఆ వెంట‌నే లోక‌ల్ పేప‌ర్లు.. దీనిని ప్ర‌ముఖంగా ముద్రిస్తాయి. “ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న ని ర్ణ‌యాలు పెట్టుబ‌డి దారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి“- ఓ జాతీయ చానెల్‌లో చ‌ర్చ‌. వెంట‌నే రం గంలోకి దూకేసు ఓ వ‌ర్గం లోక‌ల్ మీడియా జ‌గ‌న్‌పై విప‌రీత క‌థ‌నాల ప‌రంప‌ర‌ను వండి వారుస్తున్నా యి. ఈ వార్త‌ల‌ను ప‌ట్టుకుని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ భారీ ఎత్తున విరుచుకుప‌డుతూ ఉంటుంది. దీనిని ఆధారంగా చేసుకుని కేంద్రానికి ఫిర్యాదులు చేస్తామ‌ని అంటుంది.

వెర‌సి మొత్తంగా రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వంపైనా, సీఎం జ‌గ‌న్‌పై “ఒక ముద్ర‌“ వేసేందుకు అంద‌రూ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. కొన్ని రోజుల కిందట శేఖ‌ర్‌గుప్తా.. అనే ఆన్‌లైన్ ఛానెల్‌ను ఒక‌దాన్ని మెయింటెన్ చేస్తున్న ఎడిట‌ర్ జ‌గ న్‌పై విరుచుకుప‌డ్డారు. ఆ వెంట‌నే రంగంలోకి దిగిన తెలుగు మీడియా ఇంకేముంది.. జ‌గ‌న్ కు పాల‌న చే తకావ‌డం లేదు.. అంటూ ఆయ‌న చెప్పిన క‌థ‌నాన్నే.. అటు మార్చి ఇటు మార్చి.. మ‌ళ్లీ వండి వ‌డ్డించింది.

తాజాగా కూడా హైద‌రాబాద్‌కు చెందిన సీతారామ‌న్ అనే ఫ్రీలాన్స్ పాత్రికేయుడు త‌న అబిప్రాయాన్ని ఓ ఆంగ్ల మీడియాతో పంచుకుంటే.. అదే ప్రామాణికంగా భావించిన తెలుగు మీడియా చిల‌వ‌లు ప‌ల‌వ‌లుగా చేసి చూపించింది. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఇదంతా కూడా వ్యూహాత్మ‌కంగా జ‌గ‌న్‌, ఆయ‌న ప్ర‌భుత్వంపై జ‌రుగుతున్న దాడిలాగా అనిపిస్తోంద‌నే భావ‌న ఉంటోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌త ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి పొందిన వారిలో ఒక్క తెలుగు మీడియా జ‌నాలే కాకుండా.. జాతీయ మీడియా పండితులు కూడా ఉన్నారు. దావోస్ వెళ్లిన‌ప్పుడు.. సింగ‌పూర్‌కు వెళ్లిన‌ప్పుడు అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు జాతీయ మీడియాను మ‌రిచిపోకుండా వెంటేసుకుని వెళ్లి ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో బ‌స ఏర్పాటు చేసి.. `బాగా నే` చూసుకున్నారు. బ‌హుశ ఆవిశ్వాసంతో వారేమ‌న్నా ఇప్పుడు బాబుకు ఫేవ‌ర్ చేయాల‌ని భావిస్తున్నా రా? అనే సందేహాలు కొంద‌రు మేధావుల‌కు వ‌స్తున్నాయి.

అంటే.. జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తే ఇలా అంటారా? అంటే.. కాదు కాదు.. దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండ‌గా.. ఒక్క జ‌గ‌న్‌ను మాత్ర‌మే టార్గెట్ చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? అనేది క‌దా? కీల‌క ప్ర‌శ్న‌. అది కూడా జ‌గ‌న్‌కు పాల‌న చేత‌కాదు! అనే చంద్ర‌బాబు కోణాన్నే ఎందుకు తీసుకుంటున్నార‌నేది మ‌రో ప్ర‌శ్న‌. అందుకే.. ఈ రాత‌ల వెనుక.. ఏదో జ‌రుగుతోంద‌నే భావ‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

అయితే, ఇది ఇప్ప‌ట్లో తేలుతుందా? లేదా? అనేది చూడాలి. గ‌తంలో ప్ర‌ధాని మోడీ నే అన్న‌ట్టు.. క‌త్తిప‌ట్టుకుని వ‌చ్చే శ‌త్రువును ఎదిరించ‌డం పెద్ద క‌ష్ట‌కాదు.. కానీ, క‌లం ప‌ట్టుకుని వ‌చ్చే శ‌త్రువును ఎదిరించ‌డ‌మే సాహ‌సోపేతం!! అని బ‌హుశ ఆయ‌న ఎంత అనుభ‌వంతో అని ఉంటారో?! అని ఇప్పుడు మేథావులు చ‌ర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version