ఆ డాక్టర్ ని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం…!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఒక వీడియో తీవ్ర దుమారం రేపింది. ఆ వీడియో నర్సీపట్నం సీనియర్ వైద్యులు ఒకాయన ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేసారు. కరోనా వైద్యం చేసే వైద్యులకు కనీస రక్షణ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పత్రికల్లో కూడా ప్రచురించారు. ఆయన పేరు డాక్టర్ సుధాకర్. తీవ్ర విమర్శలు చేసారు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని.

అవసరం అయితే ప్రధాని నరేంద్ర మోడిని కూడా తాను కలిసి పరిస్థితి వివరిస్తా అని కనీస రక్షణ ఇవ్వడం లేదని, మాస్క్ 15 రోజులు వాడమని చెప్తున్నారని సంతకం తీసుకుంటున్నారు అని ఆయన ఆ వీడియో లో సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి సదరు ఆస్పత్రిని కూడా సందర్శించారు. ఇక ఆయన ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం తో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి ఎనస్ధిషియన్ డాక్టర్ కె. సుధాకర్‌ ని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వులను ఇటీవల ఆయన ఒక వీడియో విడుదల చేసారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పై తీవ్ర ఆరోపణలు చేసారు. ఆయనను టీడీపీ నడిపిస్తుంది అని మండిపడ్డారు. ఆయనతో టీడీపీ నేతలు డ్రామా ఆడిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు దీని వెనుక ఉన్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version