ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నారు. సింపుల్ గా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కంటే వైసీపీ సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని సపోర్ట్ చేస్తూ… సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి పాటకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు స్టెప్పులు వేశారు. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ లో… జెండలు జత కట్టడమే మీ ఎ జండా అంటూ సాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి పాటకు టెక్కిలు స్టెప్పులు వేశారు. గణపతి విగ్రహం ముందు పెట్టుకుని జగన్ పాటలతో రచ్చ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
పొరుగు రాష్ట్రాల్లోనూ మార్మోగుతున్న ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పాట
హైదరాబాద్ హైటెక్ సిటీలో "జెండలు జెతకట్టడమే మీ అజెండా.." @ysjagan పాటకు స్టెప్పులు వేసిన టెక్కీలు
గణేష్ ఉత్సవాల సందర్భంలోని సన్నివేశం pic.twitter.com/g3yGL7KcX3
— Telugu Feed (@Telugufeedsite) August 29, 2025