కరోనా కట్టడిపై ఏపీ గవర్నర్ సమీక్ష..!

-

ఏపీలో కరోనా కట్టడి చర్యలపై సీఎస్ నీలం సాహ్ని, వైద్యాధికారులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడిలో డాక్టర్లు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది అందిస్తున్నసేవలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేశాక కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు సంఖ్య బాగా పెరిగిందని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వైరస్ వ్యాప్తి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

అలాగే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు బాగున్నాయని ఇదే కృషిని మరింత కొనసాగించి అధికసంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా పాజిటివ్ వచ్చి రోగులందరికీ మెరుగైన వైద్య సేవలందించి వైరస్ వ్యాప్తి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పది లక్షల జనాభాకు ఎక్కువ మందికి పరీక్షలు చేయడంలోను సంజీవని వంటి మొబైల్ టెస్టింగ్ వాహనాల ద్వారా పెద్దఎత్తున పరీక్షలు చేయడంలో దేశంలో మిగతా రాష్ట్రాలకంటే మన రాష్ట్రం ముందంజలో ఉండడం అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version