అమరావతి : క్యాంపు కార్యాలయంలో నూతన విద్యావిధానంపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన విద్యా విధానంలో స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరించారు. శాటిలైట్ స్కూల్స్ ( పీపీ–1, పీపీ–2), ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2. 1, 2), ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ) ప్రీ హైస్కూల్స్ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ),
హైస్కూల్స్ ( 3 నుంచి 10వ తరగతి వరకూ ), హైస్కూల్ ప్లస్ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ) ఇలా స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణవల్ల స్కూళ్ళ సంఖ్య 44 వేల నుంచి సుమారు 58వేల వరకు అవుతాయని సీఎం జగన్ కు వివరించారు అధికారులు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలని.. ఈ విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటారన్నారు. అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్ ఛానల్ ఏర్పడుతుందని.. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని పేర్కొన్నారు. ఎన్ఈపీ పై కలెక్టర్లు, జేసీలు, డీఈఓలు, పీడీలకు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు.