భారత రెజ్లర్ రవి దహియా ( Wrestler Ravi Dahiya ) అద్భుతం చేశాడు. రెజ్లింగ్ 57కిలోల విభాగం సెమీ ఫైనల్స్‌లో కజకిస్తాన్ నూరిస్లామ్‌పై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ తర్వాత రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరుకున్న భారత రెజ్లర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే, రవి దహియా విజయాన్ని తమ విజయంగా నహరి గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒలింపిక్ మెడల్‌తోపాటు తమ గ్రామానికి హాస్పిటల్, నిరంతర విద్యుత్ వస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రవి దహియా స్వగ్రామం నహరి సోనేపాట్ జాతీయ రహదారికి 10 కి.మీ. దూరంలో ఉంటుంది. పగటి సమయంలో కేవలం రెండు గంటలు రాత్రుల్లో 6గంటల మాత్రమే కరెంట్ సౌకర్యం ఉంటుంది. హాస్పిటల్ సౌకర్యం కూడా లేదు.
ఒలింపిక్స్ ఫైనల్స్ రవి చేరుకోవడంతో తమ సమస్యలు తీరుతాయని గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఒలింపిక్ మెడల్ వచ్చింది. అతి త్వరలో హాస్పిటల్ కూడా కచ్చితంగా వస్తుంది. నిరంతర నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం కోసం గ్రామస్తులు వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కచ్చితంగా మారుతాయి అని రవి తండ్రి రాకేశ్ దహియా తెలిపారు.
అయితే, రవి దహియా సెమీ ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా పవర్ కట్ ఉండదని గ్రామస్తుల స్థానిక అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమయంలో సాధారణంగా విద్యుత్ ఉండదు. కానీ, ఈరోజు అధికారులు కొన్ని మినహాయింపులు ఇచ్చారు అని రవి మామ తెలిపారు.