ఆంధ్రప్రదేశ్ లో ఎలా అయినా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి తీరాలి అని నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎలా అయినా వాటిని వాయిదా వేయించాలి అని ప్రభుత్వం చేయని ప్రయత్నాలు లేవు. స్థానిక సంస్థల పై క్లారిటీ లేకపోవడంతో ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్పీ, ఎంపిపిల స్థానం లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగీస్తూ ఈ ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.
మరో ఆరు నెలలు పాటు పాలన పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మండల పరిషత్ లో జూలై 3, జిల్లా పరిషత్ లో జూలై 4 వరకు ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. ఈ మేరకు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశాయి. ఇక మూడు నాలుగు రోజుల్లో నిమ్మగడ్డను కలవాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.