2020 మనకు బాగా నేర్పింది ఒక్కటే. మాస్క్ లేకుండా బయటకు రావొద్దు. మాస్క్ ధరించకుండా బయటకు వస్తే ప్రాణాలుపోతాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి మాస్క్ లు ధరించాలి. అయితే ఈ మాస్క్ లు అన్నీ కూడా ఇప్పుడు సంచలనం అయ్యాయి. రకరకాల మాస్క్ లు వచ్చాయి. భారీ ధరలు కూడా మాస్క్ పెట్టే వాళ్ళను కంగారు పెట్టాయి. అయితే ఈ మాస్క్ ల వెనుక విమర్శలు కూడా ఉన్నాయి.
పాకిస్తాన్ లోని పెషావర్లో ఒక వ్యక్తి బయటకు వెళ్ళే ముందు మాస్క్ పెట్టుకున్నాడు. మాస్క్ తో 2021 నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించాడు. అయినప్పటికీ, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అని అంటారా…? అతను ధరించిన మాస్క్ రక్షణ కోసం మాత్రం కాదు. అతను ప్రజలను భయపెట్టడానికి కాస్ట్యూమ్ మాస్క్ ధరించాడు. అందుకే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.
నూతన సంవత్సర పండుగ సందర్భంగా, ఆ వ్యక్తి 2020 చివరి రోజున ప్రజలను చిలిపిపని చేయడానికి తోడేలు రూపంలో ఉన్న మాస్క్ ని పెట్టుకున్నాడు. ఈ సంఘటనను పాకిస్తాన్ జర్నలిస్ట్ ఒమర్ ఆర్ ఖురైషి ట్విట్టర్‌లో పంచుకున్నారు. అతను ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. అతన్ని ఆ మాస్క్ తోనే అరెస్ట్ చేసి చైన్ తో కట్టేశారు పోలీసులు. సోషల్ మీడియాలో మాత్రం ఆసక్తికర కామెంట్స్ వస్తున్నాయి. మాస్క్ ధరించడం అతను చేసిన పాపమా అని ప్రశ్నించారు.