అమ్మాయిలని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెబుతుంటారు. వారి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని అందరూ అనుకుంటూ ఉంటారు. అబ్బాయిలు, అమాయిల గురించి ఏ విధంగా ఆలోచిస్తారనే విషయం అందరికీ తెలుస్తుంది. కానీ అమ్మాయిలు, అబ్బాయిల గురించి ఏ విధంగా ఆలోచిస్తారనే విషయం తెలియదు. ఎందుకంటే, అమ్మాయిలు వాళ్ళకి వాళ్ళుగా ఎప్పుడూ బయటపెట్టరు. సైకాలజీ ప్రకారం అమ్మాయిల ఆలోచనల గురించి ఇక్కడ చూద్దాం.
అబ్బాయిల లాగే అమ్మాయిలు కూడా తమ క్రష్ గురించి పగటికలలు కంటూ ఉంటారట. కానీ ఆ విషయాన్ని ఇతరులకి తెలియజేయడానికి ఇష్టపడరు.
సాధారణంగా అమ్మాయిలు తమని ఎవరు పట్టించుకోరో వారిని బాగా గమనిస్తారట. తమని అదేపనిగా చూసేవాళ్లకంటే తమని పట్టించుకోకుండా ఉండేవారిపైనే దృష్టి పెడతారట.
చిన్నపిల్లలని ఆడించే మగవారి పట్ల అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులు అవుతారట. పిల్లలని పట్టించుకోని వారిని పెద్దగా పట్టించుకోరట.
ఇంటి చుట్టుపక్కన పూల మొక్కలు, ఇంట్లో చిన్న పూలకుండి కలిగే ఉంటే అమ్మాయిలు చాలా ఆకర్షితులవుతారట. అవేమీ లేని ఇంట్లో ఉన్న మగవాళ్లని అంతగా పట్టించుకోరట. పూలు రొమాన్స్ కి సంకేతం కావడామే దానికి కారణమట.
అందంగా ఉన్న అమ్మాయిలని చూడడానికి అబ్బాయిలు ఇష్టపడతారు. ఐతే అమ్మాయిలకి అబ్బాయిలో నచ్చే విషయాలల్లో ఛాతీ వెనకభాగం విశాలంగా ఉండాలని అనుకుంటారట. ఇంకా, అందం కన్నా వాళ్ళు అమ్మాయిలతో ప్రవర్తించే విధానం పట్ల అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులవుతారట. అంటే అందంపై ఆడవాళ్ళకి అంతగా పట్టింపు ఉండదట.
ఐతే అందరమ్మాయిలు ఇలాగే ఉంటారా అంటే అదీ కాదు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. పైన చెప్పినవన్నీ అందరమ్మాయిలకి వర్తించాలన్న రూలేం లేదు.