AP: రేపు వారికి సెలవు లేదు…వర్కింగ్ డే !

-

చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రోజు రేపు రానుంది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రేపు చాలా కట్టు దిట్టమైన భద్రతల నడుమ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.. కాగా రాష్ట్రంలో రేపు ఎన్నికలు ఉన్నందున సెలవు విషయం పై ఒక సందేహం అందరిలోనూ ఉంది. అయితే ఈ సెలవు తెలంగాణ వారి గురించి కాదు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఉద్యోగుల కోసం అని తెలుస్తోంది. తెలంగాణ లో ఓటు హక్కును కలిగి ఉండి, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగం చేస్తున్న వారికి జగన్ ప్రభుత్వం సెలవు ప్రకటించడం జరిగింది. ఇక ఈ సెలవుపై ఎటువంటి వేతనం కూడా కట్ కాదని రాష్ట్ర ఎన్నకల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఎప్పట్లాగే విధులకు హాజరు కావాలి.. వారికి సెలవు లేదంటూ ప్రకటించింది.

ఈ ప్రకటనతో ఏపీలో ఉద్యోగం చేస్తున్న తెలంగాణ వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంతోషపడి ఉంటుందని చెప్పాలి. మరి రేపు తెలంగాణాలో ప్రశాంతంగా ఎన్నికలు ముగియాలని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version