ప్రభుత్వ బడుల గురించే 24 గంటలు ఆలోచిస్తున్నా : రాజగోపాల్ రెడ్డి

-

మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ బడుల అభివృద్ధి గురించి 24 గంటలు ఆలోచిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టంచేశారు. రాజకీయాల్లో తనకు ఏ పదవివచ్చినా అది కిరీటం కాదని..ప్రజాసేవ చేసే బాధ్యతగా భావిస్తానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ణాన్ ప్రతిస్టాన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సుకు ఆయన హాజరయ్యారు.

అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను, 601 గాంధీ ప్రతిమల ప్రదర్శన,సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు అన్యాయం చేసే అవినీతి పరులను వదిలి పెట్టబోమన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ సొమ్ము, పేదల జోలికి పోవద్దని హితవు పలికారు. మంచి పనులు చేసే నేతలు ప్రజల హృదయాల్లో ఉంటారని, గతంలో నా రాజీనామాతో ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని గుర్తుచేశారు. తన సెగ్మెంట్లో బెల్ట్‌ షాపులు తగ్గాయని, ప్రభుత్వ బడుల గురించి 24 గంటలు ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version