ఏపీలో కాపులకి ఏపీ సర్కార్ శుభవార్త

-

ఏపీలో కాపులకి ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ కాపు నేస్తం పథకానికి అర్హులై కూడా లబ్ధి చేకూరని వారి జాబితా సిద్ధమైంది. దీంతో ఏపీలో ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు సహా మొత్తం 95245 మందికి కాపు నేస్తం పథకం వర్తింపు చేయనున్నారు అధికారులు. ఈ మేరకు కొత్త లబ్ధిదారులకు పాత వారికి అందరికీ కలిపి 142 కోట్ల 87 లక్షల నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నిధులను మంత్రి వేణుగోపాల్ చెల్లుబోయిన అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ దాడిశెట్టి రాజాలు కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణు అర్హులైన ప్రతి ఒక్కరికీ కాపు నేస్తం నిధులను అందిస్తామని చెప్పినట్టే కొత్త వారికి కూడా నిధులు ఇచ్చామని చెప్పారు. కాపులకు జగనన్న ఇస్తున్న దీపావళి కానుక ఇది అని మంత్రి అన్నారు. బాధల్లో ఉన్న వారిని చూసి చలించే మనస్తత్వం ఉన్న జగన్ పాదయాత్రలో ఎంతో మంది సమస్యలు విని జగన్ వాటన్నింటికి ఇప్పుడు పలు విధాలుగా పరిష్కారాలను చూపిస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version