చిరు వ్యాపారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే 4,90,376 మందికి జగనన్న తోడు పథకం ద్వారా ఆరో విడతలో మళ్లీ రుణాలు ఇప్పించేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు బుధవారం నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా మండల, మునిసిపాలిటీల వారిగా బ్యాంకర్లు, లబ్ధిదారుల సమావేశాలు నిర్వహించనుంది.
25న జిల్లాల స్థాయిలో డిసిసిల సమావేశాలు నిర్వహించి బ్యాంకుల వారిగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాల పంపిణీ కార్యక్రమాలను సమీక్షించనున్నారు. దీనికి సంబంధించి గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ షాన్ మోహన్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిఆర్డిఏపిడిల ఆధ్వర్యంలోను, మునిసిపాలిటీల్లో మొప్మా ఆధ్వర్యంలో ఈ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.