కోర్టు చెప్పినా వెనక్కు తగ్గని ఏపీ సర్కార్ !

-

విశాఖలో నిర్మించే స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. రాజధానుల అంశం కోర్టులో ఉన్నా స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ విషయంలో వెనక్కు తగ్గేది లేదంటోంది ఏపీ సర్కార్. ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని ప్రచారం కూడా జరుగుతున్న ఈ స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం 30 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ప్రభుత్వం రాజధాని తరలింపు ప్రక్రియలో భాగంగానే స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ నిర్మిస్తోందని శంకుస్థాపన కూడా చేసిందని రాజధాని మార్చ వద్దని పిటిషన్‌ వేసిన వారు ప్రస్తావించారు.

ap govt decided to increase districts

అయితే ఈ విషయం మీద కౌంటర్‌ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. కానీ ప్రభుత్వం ఏమో నిన్నటి ఉత్తర్వులలో ఈ ప్రక్రియను అత్యవసర అంశంగా పరిగణించాలని సూచించింది. ఇంత వేగంగా పనులు జరుగుతున్నాయంటే, ఇదంతా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పనుల్లో భాగంగానేనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. నిజానికి రాష్ట్రాలకి స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ చాలా ముఖ్యమైనది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా ఎవరైనా ముఖ్యమైన ప్రముఖులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వారికి పటిష్టమైన సెక్యూరిటీతో వసతి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే కాబట్టి ఒక్కో రాష్ట్రం ఒక్కో స్టేట్ గెస్ట్ హౌస్ ని ఏర్పాటు చేసుకుంటుంది. అమరావతిలో ఇంకా ఈ గెస్ట్ హౌస్ నిర్మించని కారణంగా ఇప్పటి దాకా బెజవాడలోని ఖరీదైన హోటళ్ళలో బస ఏర్పాటు చేసేవారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version