విశాఖకు కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ ఓడలో రెస్టారెంట్ ?

విశాఖకు కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ ఓడలో రెస్టారెంట్ ప్రారంభించే ప్రతిపాదన చేస్తున్నామని ఏపీ పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖలో విమానం, సబ్ మెరైన్ వంటివి పర్యాటకంగా ఆకర్షిస్తున్నాయని, వీటితో పాటు తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడను కూడా పర్యాటకానికి వినియోగించుకోవాలని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ఓడకు చెందిన యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన అన్నారు.

Bangladeshi Cargo Ship Runs Aground on Vizag Beach Amid Heavy Winds

అలానే విశాఖలో సీ-ప్లేన్ కోసం కూడా ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని అన్నారు. గత ప్రభుత్వం కృష్ణా నుంచి నాగార్జున సాగర్ కు సీ-ప్లేన్ ప్రతిపాదనలు పంపిందని వాటితో పాటు విశాఖ కేంద్రంగా మరో సీ-ప్లేన్ కు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరామని మంత్రి పేర్కొన్నారు. అలానే టూరిజం బోట్లను పూర్తి స్థాయిలో అనుమతించాలని నిర్ణయం తీసుకునామని అన్నారు. పాపికొండలు, ప్రకాశం బ్యారేజ్ మినహా అన్ని చోట్ల బోటింగుకు అనుమతిస్తున్నామని అయన అన్నారు.