విద్యుత్ ప్రమాదాల నివారణ పై ఏపీ ప్రభుత్వం వర్క్ షాప్

-

తిరుపతి లో ఎలక్ట్రికల్ సేఫ్టీ వర్క్ షాప్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. విద్యుత్ ప్రమాదాల నివారణ పై వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది.. ఆర్ధిక అభివృద్ధికి విద్యుత్ శాఖ చాలా ముఖ్యం అని ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మరో సారి రుజువైందన్నారు. అనేక రకాల సమస్యలను అధిగమించేందుకు అందరూ కృషి చేయాలి.. ఎలక్ట్రికల్ సేఫ్టీ చాలా ముఖ్యం, చిన్న అలసత్వం కూడా అత్యంత ప్రమాదకరం అని తెలిపారు.

అటవీ జంతువులు కట్టడికి కూడా విద్యుత్ వైర్లు లాగుతున్న పరిస్థితి ఉంది. వీటి పై ప్రత్యేక దృష్టి సారించాలి.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తె అందులో 9 లక్షల కోట్లు విద్యుత్ శాఖకు వచ్చాయన్నారు. చంద్రబాబు నాయుడు భారీగా ప్రచారం చేసుకున్నా కూడా అయన పెట్టిన సమ్మిట్ కు సంబందించి ఎక్కడా ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు.. ఈరోజు సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సమ్మిట్ కు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారని వివరించారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశాం.. సబ్ స్టేషన్ లెవల్ లో కూడా కమిటీ వేస్తే, వారి సమన్వయంతో మరింత ముందుకు సాగుదామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version