చంద్రబాబు అలా చేయడం వల్లనే ఏపీ కి ఇప్పుడు రాజధాని లేదు అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇవాళ మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జకటే చెబుతున్నాడని.. తాము మంచి చేశామని ప్రజలు భావిస్తే.. మరో అవకాశం ఇవ్వమని అడుగుతున్నారని పేర్కొన్నారు. అలా అడగడంలో తప్పు ఏముంది అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో తమ పార్టీ విధానం ఎప్పుడో చెప్పామని.. చెప్పిన దానికే కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
అలాగే హైదరాబాద్ విశ్వనగరం అని.. అదే ప్రశాంత్ రెడ్డి ఆస్తి కాదని.. అక్కడ ఎవ్వరికైనా ఆస్తులు ఉండవచ్చని ఎద్దేవా చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు అర్థరాత్రి పారిపోయి వచ్చారు. అందుకే నేడు ఏపీకీ రాజధాని లేని దుస్థితి దాపురించిందని ఆరోపించారు. తమ పార్టీ స్టాండ్ ఎప్పుడూ కూడా విభజన హామీలు సాధించడమేనని పేర్కొన్నారు. తాము ప్రజలు ఏం మేలు చేశామో చెప్పే ఓట్లు అడుగుతున్నామని.. తమకి ఎలాంటి జిమ్మిక్కులు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు.