ఏపీ ప్రభుత్వానికి మరో షాకిచ్చింది ఏపీ హైకోర్టు. ఎన్నికల సంఘం ఉద్యోగుల మీద సీఐడీ నమోదు చేసిన కేసుల మీద స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు. విచారణ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ ఎవరిపై చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని ప్రొసీడింగ్స్ రికార్డులను కోర్టులో సబ్మిట్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలానే విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ఎన్నికల సంఘం ఉద్యోగులను విధులు నిర్వర్తించకుండా సీఐడీ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం… కేసులుపై స్టే విధించింది. నిజానికి తనకు రక్షణ కల్పించాలని గతంలో కేంద్ర హోం శాఖకు నిమ్మగడ్డ లేఖ రాశారు. అయితే ఆ లేఖ ఆయన రాయలేదని, ఎవరో రాస్తే దానిని ఈయన కాపీ పేస్ట్ చేశారని చెబుతూ కొందరు వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే సీఐడీ కేసులు నమోదు చేసింది.