AP : పవన్ కల్యాణ్ టీంలోకి ఆమ్రపాలి?

-

మొన్నటివరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వహించిన ఐఏఎస్ అధికారిణి కాట ఆమ్రపాలి డివోపీటీ ఉత్తర్వుల మేరకు సొంత రాష్ట్రం కేడర్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే. తనను తెలంగాణలోనే ఉంచాలని ఆమెతో పాటు మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులు క్యాట్‌తో పాటు హైకోర్టును ఆశ్రయించినా వారికి ఫలితం దక్కలేదు. తీరా ఏపీకి వెళ్లికి అక్కడ చీఫ్ సెక్రెటరీకి రిపోర్టు చేయాల్సి వచ్చింది.

అయితే, కాట ఆమ్రపాలికి సంబంధించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీంలోకి ఆమ్రపాలి వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఆమె బుధవారమే ఏపీకి చేరుకున్నారు. గురువారం ఉదయం రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్‌కు రిపోర్టు చేశారు.ఆమెకు కేటాయించే శాఖపై అప్పుడే చర్చ మొదలైంది.డిప్యూటీ సీఎం పవన్ టీంలో ఆమ్రపాలిని నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.నేడు ఆమ్రపాలికి కేటాయించే శాఖకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version