ఏపీ ఇళ్ళ పట్టాల పంపిణీలో తీవ్ర విషాదం..కొబ్బరి చెట్టు విరిగిపడి ! !

Join Our COmmunity

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో అపశృతి చోటు చేసుకుంది. ఇళ్ల పట్టాలు పంచడం కోసం రెండు రోజులు క్రితమే కార్యక్రమాన్ని ఖరారు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎనిక ఎన్నికల షెడ్యూలును ప్రకటించి, ఎన్నికల నిబంధనావళిని వెంటనే అమలులోనికి తీసుకువస్తున్నట్టు ప్రకటించటంతో అధికారులు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. విషయం తెలియని లబ్ధిదారులు సమావేశ స్థలానికి రావటంతో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పట్టాలు పంపిణీ ఎందుకు ఆగిపోయిందో వివరిస్తున్న సమయంలో ఆ పక్కన ఉన్న కొబ్బరిచెట్టు ఒక్కసారిగా విరిగి మహిళలు కూర్చున్న షామియానపై పడింది.

దీంతో షామియానా కిందనున్న మహిళలు చెట్టు కింద ఇరుక్కుపోయారు. సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తమై వారిని బయటికి తీశారు. చెట్టుకింద ఇరుక్కుపోయినవారిలో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలకు గురికాగా మరో ఆరుగురు గాయాలకు గురయ్యారు. బాధితులను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలకు గురైన కాసాని దుర్గాభవాని, గరగ శాంతలు మృతి చెందారు. మిగిలినవారు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టాలు పంపిణీ ఎందుకు ఆగిపోయిందో లబ్ధిదారులకు వివరిస్తున్న సమయంలో కొబ్బరిచెట్టు విరిగిపడిందని ఎమ్మెల్యే కారుమూరి తెలిపారు.  

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news