మద్యపాన నిషేధంపై ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వింత వివరణ ఇచ్చారు. మద్య నిషేధం అనే మాటే చెప్పలేదని బుకాయించారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
“మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతోంది.. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి.. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం… మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాం” ఇదీ వైకాపా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నాలుగు లైన్ల వాగ్దానం.
కానీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాత్రం మద్యపాన నిషేధం అనే మాటే తమ మేనిఫేస్టోలో లేదు అంటున్నారు. ఏపీలో మద్యం ధరను ఫైవ్ స్టార్ హోటల్ రేట్లకు తీసుకువెళ్తామని చెప్పామని.. అదే చేస్తున్నామని అన్నారు. ఎవరైనా తాగాలంటే షాక్ కొట్టేట్టుగా ధరలను చేస్తామని తమ అధినేత చెప్పారని తెలిపారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా తమ మేనిఫెస్టో గోడలపై ఉంటుందని.. వెళ్లి చూసుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు.
అసలు ఎన్నికల ప్రణాళికలో ఏ ముందంటే?..