పవన్ కళ్యాణ్ అట్టర్ ఫ్లాప్ హీరో..అన్ని సినిమాలు ఫెయిలే అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు అహంభావమని.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సక్సెస్ కంటే ఫెయిల్యూర్లే ఎక్కువ అని నిప్పులు చెరిగారు. నా గురించి నాగబాబుకు బాగా తెలుసని… ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి
వెళ్ళటం మినహా పవన్ కళ్యాణ్ కు ఏం తెలుసు? అని చురకలు అంటించారు. రాష్ట్రంలో ఉంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి తెలుస్తుందని..రోడ్ యాక్సిడెంట్స్ టీడీపీ హయాంలో జరుగలేదా? అని నిలదీశారు.
బీజేపీతో పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ సాధించింది ఏంటి?? టీడీపీతో పొత్తు నుంచి ఎందుకు బయటకు వచ్చారు ఇప్పుడు ఎందుకు కలుస్తాను అంటున్నారు?? అని ప్రశ్నించారు. లక్షా 30 వేల కోట్లను పేదలకు సంక్షేమ పథకాల ద్వారా అందించామని… వీటిలో ఒక్క రూపాయి అయినా అవినీతి జరిగిందా?? అని నిలదీశారు.
పీఆర్పీ నుంచి వచ్చిన నాయకుల్లో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని జగన్ పై ప్రశంసలు కురించారు.ప్రజల్లో అభిమానం లేకపోతే గత మూడు ఎన్నికల్లో వరుసగా ఎందుకు గెలుస్తానని.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయటం ఆవిర్భావ సభ పెట్టారా అని ప్రశ్నించారు. మేమూ కాపు బిడ్డలమేనని.. సోషల్ ఇంజనీరింగ్ లేకుండానే ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎమ్పీల తీర్పు ఇచ్చారా అని ఆగ్రహించారు.