ఆ ఏపీ మంత్రికి క్యాస్ట్ ఫీలింగ్ త‌ప్ప‌డం లేదా..?

-

స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్న భారతదేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో కుల వివక్ష కొనసాగుతోంది. ఈ క్రమంలో కుల వివక్ష సామాన్యులకు మాత్రమే కాదు విద్యార్థులు ఉన్నత ఉద్యోగుల నుంచి చివరకు రాజకీయ నాయకులు కేబినెట్ మంత్రులు సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో కీలక శాఖకు మంత్రిగా ఉన్న యువనేత సైతం కుల వివక్షకు గురవుతున్నట్టు ఏపీ రాజకీయ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వైసిపి ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయన వరుస విజయాలు సాధించారు.

ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాల పరంగా మరో అగ్ర సామాజికవర్గం మంత్రి పదవుల కోసం కాచుకుని కూర్చున్న జగన్ మాత్రం ఆ యువనేతకు కీలకమైన శాఖను కట్టబెట్టారు. మంత్రి తన శాఖతో పాటు విపక్షాల ను టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు. వైసిపికి భవిష్యత్తులోనూ బలమైన నేతగా కనిపిస్తున్నారు. అయితే ఇది ఆ జిల్లా రాజకీయాలను శాసించే ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఎంతమాత్రం నచ్చటం లేదు. పార్టీ మన వాడిది మనం సీనియర్లను నిన్నగాక మొన్న వచ్చిన అతను దూసుకెళ్లడం ఏంటని వారంతా ఆయన మంత్రి పై కక్ష గట్టినట్టు తెలుస్తోంది.

తమ నియోజకవర్గాల్లో జరిగే పనులకు సైతం ఆ యువనేత మంత్రిగా ఉన్నప్పటికీ వారు కనీసం పిలవటం లేదంట. పార్టీ మా వాడిది మంత్రి ఎవరైనా సరే తమ వద్దకు రావాలని ఆ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన పెద్దపెద్ద నేతలంతా మంత్రిపై పెత్తనం చేస్తున్నట్టు జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ముందు అందరినీ కలుపుకుపోయెందుకు ఎంత ప్రయత్నించిన మంత్రి రానురాను ఆ సామాజిక వర్గంలో పెద్ద నేతలు తనను టార్గెట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకుని తన పని తాను చేసుకు పోతున్నాడని తెలుస్తోంది.

ఇక మంత్రి హోదాలో జిల్లా కేంద్రంలో పలు ప్రారంభోత్సవాలకు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు మంత్రి హోదాలో ఆయన ఒక్కరే హాజరవుతున్న జిల్లాకు చెందిన మిగిలిన సీనియర్ ఎమ్మెల్యేలు మాత్రం ఆయన ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. విచిత్రమేమిటంటే ఆ జిల్లా రాజకీయాలను పార్టీ ఏదైనా ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతలే గత కొన్ని దశాబ్దాలుగా శాసిస్తున్నారు. ఇప్పుడు జగన్ వారికి కాదని బడుగు బలహీన వర్గాలకు చెందిన యువ నేత మంత్రి పదవి కట్టబెట్టడాన్ని వారు ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ యువనేతను టార్గెట్ చేస్తున్న అంశానికి జ‌గ‌న్ ఎలా చెక్ పెడ‌తాడో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version