ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కమిటి కీలక విషయాలపై చర్చ జరిపినట్టు సమాచారం. అనంతరం మంత్రి పేర్ని నానీ మీడియా తో మాట్లాడారు. ఈ నెల 17న హైపవర్ కమిటి సమావేశం మరోసారి జరుగుతుందని అన్నారు. 17 లోపు రైతులు తమ సూచనలను సిఆర్డిఏ కమీషనర్ కు పంపాలి అన్నారు. రాజధాని గ్రామాల్లో నిజమైన రైతులకు తాము చెప్పేది అర్ధమవుతుంది అన్నారు.
అమాయక ప్రజలను తెలుగుదేశం పార్టీ వాడుకుంటుంది అన్నారు. సి ఆర్డిఏ కమీషనర్ కు రైతులు సూచనలు ఇవ్వొచ్చు అన్నారు. పోస్ట్, ఈమెయిలు, వ్యక్తిగతంగా అయినా సరే రైతులు సూచనలు ఇవ్వొచ్చు అన్నారు. రాజకీయంగా ప్రేరేపించిన ధర్నాలు కొన్ని జరుగుతున్నాయని, ఎం చేస్తే పోలీసులపై వ్యతిరేకత పెరిగి సానుభూతి వస్తుందో తమకు తెలుసు అన్నారు. ఈ ధర్నాల వెనుక 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉందన్నారు.
రైతుల గురించి తాము చర్చించని రోజు లేదన్నారు. మరో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, చంద్రబాబు కమెడియన్ లా మారిపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సినిమాలో బ్రహ్మానందంలా తయారు అయ్యారు. ఆయన బాధలో ఉంటే ఎవరూ పండగ చేసుకోవద్దు అన్నారు. తన బాధను ప్రజలు, రైతుల మీద రుద్దుతున్నారు అన్నారు. పండగ రోజు కూడా ప్రజలను పండగ చేసుకోవద్దని కోరుకుంటున్నారు అన్నారు.