బిగ్ బ్రేకింగ్ : థాంక్యూ జగన్ అంటున్న ఏపీ జనాలు .. !!

-

దేశంలో కరోనా వైరస్ విస్తరించకుండా ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ విధించడంతో దేశంలో ఉన్న ప్రజలంతా ఇళ్ల కే పరిమితమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆంధ్రాలో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈనెల 31 వరకు లాక్ డౌన్ చేశారు వైయస్ జగన్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్…దేశమంతటా ఒక విధంగా వెళుతున్న టైములో …అటువైపు అడుగులు వేయాలి అప్పుడే వైరస్ ని అరికట్టిన వాళ్లమవుతాం అంటూ ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు.ఎవరూ కూడా భయ పడకూడదు అని తెలిపారు. అత్యవసర సేవలు మినహా రాష్ట్రం మొత్తం అన్ని రంగాలు బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ప్రజా రవాణా వ్యవస్థ, బట్టల దుకాణాలు, బంగారం షాపులు షాపింగ్ మాల్స్,  పార్కులు, క్లబ్బులు, పబ్బులు అన్ని మూసివేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు, గోదాములు ఆఫీసులలో మొదలైన కార్యాలయాలలో ముఖ్యమైన సిబ్బందితో నడిపించాలని సూచించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి లాక్ డౌన్ విదిస్తూనే… ఆంధ్ర ప్రజలందరికీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇచ్చేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది.

 

ఏ రోజుకి ఆ రోజు బతికే పేదవాళ్ల కుటుంబాల పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంటుందని…కాబట్టి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని జగన్ పిలుపునివ్వడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు జగన్ తీసుకున్న నిర్ణయానికి థాంక్యూ జగన్ అంటూ ఏపీ జనాలు కామెంట్లు పెడుతున్నారు. ఇటువంటి టైం లో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నాగాని పేద వాళ్ళ గురించి బాగా ఆలోచించావు అంటూ మరి కొంతమంది పొగుడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version