కిడ్నాప్ ఛేజింగ్ కోసం.. విమానమెక్కి ఏపీ పోలీసులు..!

ఈరోజుల్లో కిడ్నాప్ చాలా కామనైపోయిందిఅలాంటి కిడ్నాప్ కేసు పట్టుకోవాలంటే పోలీసులు కూడా చాలా యాక్టివ్ గా ఉండాలికృష్ణా జిల్లా పోలీసులు అదే చేశారుఓ కిడ్నాప్ కోసం ఏకంగా విమానం ఎక్కేశారు.. కిడ్నాపర్ల కోసం ఏకంగా ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ ఛేజ్ చేశారుమొత్తానికి కిడ్నాపర్లను పట్టుకున్నాడు..

అసలు విషయం ఏంటంటే.. కృష్ణా జిల్లా ఆత్కూరు వద్ద కిడ్నాప్ కు గురైన నెలల బాలుడి కేసును పోలీసులు విజయవంతంగా చేధించారుఈ కేసును వివిధ కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేయడం ద్వారా బాలుడిని అపహరించిన నిందితులను పట్టుకున్నట్లు విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు.

రాజస్థాన్ కు చెందిన పూలుబాయ్సోను నగరంలో నివాసం ఉంటూ ఆత్కూరు పరిధిలోని పొట్టిపాడు వద్ద చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారుకొన్ని రోజుల క్రితం రాజస్థాన్ నుంచి వచ్చిన చానుమాయ వద్ద నుంచి పూలుబాయ్ 36 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడుఆ డబ్బులు తిరిగి చెల్లించే క్రమంలో ఇద్దరికీ గొడవైంది.

ఈ క్రమంలోనే చానుమాయ పూలుభాయ్ చిన్నోడు నెలల బాలుడిని కిడ్నాప్ చేశారుఆ తర్వాత రాజస్థాన్ కు పారిపోయారుబాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారుఆత్కూరుగన్నవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

నిందితులు బాలుడిని అపహరించిన అనంతరం ఈ నెల 16న రాజస్థాన్ పారిపోయినట్టు తెలుసుకున్నారువెంటనే ప్రత్యేక విమానంలో నిందితుల కంటే ముందే రాజస్థాన్ కు వెళ్లారుఅక్కడి పోలీసులను అప్రమత్తం చేయడం ద్వారా వారి ఆచూకీ కనుగొన్నారుఅక్కడి నుంచి నిందితులను రైలులో విజయవాడ తీసుకువచ్చారుసూపర్ క్రైమ్ స్టోరీ కదూ.