విశాఖ మహానగర పట్టణ పరిధిలోని అనకాపల్లిలో రైల్వే స్టాండింగ్ కమిటీ పర్యటించింది. ఈ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ ఆధ్వర్యంలో రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు అనకాపల్లి రైల్వే స్టేషన్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్లను అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను దశలవారీగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
అందులో భాగంగానే అనకాపల్లి రైల్వేస్టేషన్‌ను ఆధునిక రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. త్వరితగతిన ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కల్పిస్తామని వివరించారు. అదేవిధంగా లక్ష్మీదేవిపేట ఫ్లై ఓవర్ పెండింగ్ పనులకు సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రమేష్ తెలిపారు. పెండింగ్ పనులను చకాచకా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.