కోవిడ్ పై ఏపీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. టెస్ట్, ట్రేస్, ట్రీట్ ,వ్యాక్సినేట్ లో భాగంగా కోవిడ్ 19 ను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటోంది. సమూహాలుగా ఏర్పడడం, గుంపుగా చేరడం పెళ్లిళ్ల లో, మత సంబంధమైన మీటింగ్ లకు 150 మందికి మించి నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇలా వచ్చిన వారు కూడా మాస్క్, మాటి మాటికి చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలు పాటించాలని ఆదేశించింది. బస్సుల్లో ప్రయాణిచేటప్పుడు సీట్ కు సీట్ కు మధ్య కాళీ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
ఈ నిబంధనలను ఎవ్వరైనా ఉల్లంగిస్తే వారిపై సెక్షన్51 నుండి 60 వరకు విపత్తు నివారణ చట్టం తో పాటు సెక్షన్ 188 ఐపిసి కింద చర్యలు వుంటాయని ఉత్తర్వులు లో పేర్కొంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వువు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగంగా జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లను నిర్వహించి వ్యాక్సిన్ లను వేస్తున్నారు. ఇక ఇప్పుడు కరోనా ఆంక్షలను విధిస్తూ కరోనాకు చెక్ పెట్టేందుకు ఏపీ సర్కార్ నడుంబింగించింది.