ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎయిడెడ్ విద్యాసంస్థల వ్యవహారంపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా… విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇక నిన్న అనంతపూర్ జిల్లాలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
అయితే దీనికి నిరసనగా ఇవాళ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను ఘరావ్ చేశాయి విద్యార్థి సంఘాలు. అనంతపురం జిల్లా SSBN కళాశాలలో విద్యార్థుల పై లాఠీచార్జి ఘటన పై మంత్రి ఆదిమూలపు సురేష్ క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు TNSF, PDSO. అంతేకాదు మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం ప్రాంగణంలోకి దూసుకు వచ్చారు విద్యార్థి సంఘాల నేతలు.
దీంతో మీడియా సమావేశాన్ని మధ్యలో ఆపేశారు మంత్రి సురేష్. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ క్షమాపణ లు చెప్పే వరకు తాము వదలని హెచ్చరిస్తున్నారు విద్యార్థులు. అనంతపురంలోని SSBN కళాశాలలో విద్యార్థి సంఘాలుగా చెప్పుకుంటున్న కొంత మంది విద్యార్థులను రెచ్చగొట్టారని.. ఈ క్రమంలో దాడికి పాల్పడ్డారని అటు ఆదిమూలపు సురేష్ చెబుతున్నారు.