ఏపీ టీడీపీ నేతలను తెలంగాణకు పంపాలంట!

-

కరోనా సమయంలో వద్దాన్నా రోడ్లపైకి వస్తున్నారు.. చంద్రబాబు లాంటి పెద్ద మనుషులు సైతం రోడ్లపై ర్యాలీలు తీయించే పనికి పూనుకుంటున్నారు.. ఇక టీడీపీ నేతలు ప్రజావేదిక పేరుచెప్పి కరకట్టపై పంచాయతీ చేద్దామని తలచారు. ఇది కరోనా సమయం.. నిరసనలకు, ధర్నాలకు, ర్యాలీలకు అనుమతులు లేని సమయం.. అది కూడా మరిచి హడావిడి చేయ నిర్ణయించుకుంటున్నారు టీడీపీ నేతలు. సరేలే… వారు కూడా రాజకీయంగా బ్రతకాలికదా అని లైట్ తీసుకునేలోపు… కరోనా గురించి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. తాజాగా ఈ విషయాలపై ఏపీ టీడీపీ నేత దేవినేని ఉమ స్పందించారు.

కరోనాకేసులు పదివేలు దాటాయి, కొవిడ్ నిబంధనలను ప్రతిపక్షాలపై కేసులుపెట్టి రాజకీయకక్ష తీర్చుకోవడానికి, అమరావతి దీక్షలు విఫలంచేయడానికి వినియోగిస్తున్నారే కానీ ప్రజలను కరోనానునుండి రక్షించడానికి ఏంజాగ్రత్తలు తీసుకున్నారో చెప్పండి అంటూ టీడీపీ నేత దేవినేని ఉమ.. ఏపీ సీఎంకు ట్వీట్ చేశారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రికార్డు స్థాయిలో, దేశంలో ఎవరూ చేయని రీతిలో చేస్తున్న టెస్టులు, తొంభై రోజుల్లో ఇంటింటికీ వెళ్లి.. ప్రజలంద్దరికీ టెస్టులు చేసి, వారి వారి ఇంటివద్దే మందులు అందించాలనే ఆలోచన చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.. అని వైకాపా నేతలనుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీంతో వీళ్లందరినీ తెలంగాణకు పంపాలని.. అక్కడ కరోనా కేసుల పెరుగుదల, టెస్టుల విషయంలో ఎదురవుతున్న విమర్శలపై స్పందించే ధైర్యాన్ని నింపాలని పలువురు కోరుకుంటున్నారు. జాతీయ పార్టీ అని చెప్పుకునే టీడీపీ నేతలకు.. పక్కనున్న తెలంగాణలోని కరోనా పరిస్థితిపై స్పందించే ధైర్యం చేయకపోవడం సిగ్గుచేటని అంటున్నారు. దీన్ని బట్టి వారికి తెలంగాణ ప్రభుత్వం అంటే ఎంత భయమో, తెలంగాణ ప్రజల ఆరోగ్యం అంటే ఎంత నిర్లక్ష్యమో అర్ధమవుతుందని అంటున్నారు వైకాపా నేతలు. సరే… ఏపీలో ఎన్ని చేస్తున్నా విమర్శలు చేస్తున్నారంటే… అది రాజకీయావసరం కాబట్టి సరే అనుకోవచ్చు కానీ… కనీసం తెలంగాణ గురించి కూడా ఎంతో కొంత ఆలోచించాలి కదా తమ్ముళ్లూ అని పలువురు సూచిస్తున్నారు.. కష్టమని తెలిసినా, అసాధ్యం అనిపించినా కూడా!

Read more RELATED
Recommended to you

Exit mobile version