ఏపీ అసెంబ్లీ వాళ్లకు కూడా చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇక ఇవాళ కూడా అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఘర్షణ అనంతరం ప్రారంభమైన అసెంబ్లీలో బెందాళం అశోక్, అచ్చం నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, డోల బాల వీరాంజనేయ స్వాములను స్పీకర్ సభ నుంచి ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు.
అనంతరం కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట ధర్నాకు దిగారు. ఇక అటు టిడిపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి… వైసిపి ఎమ్మెల్యే సుధాకర్ బాబు పరస్పరం దాడి చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఈ గందరగోళ పరిస్థితులలో అసెంబ్లీని స్పీకర్ సీతారాం వాయిదా వేశారు. ఇక ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని… ఇవాళ చలో అసెంబ్లీకి ఏపీలోని ప్రతిపక్షాలు పిలుపు ఇచ్చాయి.