ఏపీలో టెట్ నోటిఫికేషన్ నేడు విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. టెట్ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం. http://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో ఈ రోజు ఉదయం 10.30 నుంచి అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నోటిఫికేషన్, ఇన్ఫర్మే షన్ బులిటెన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుము, ఆన్లైన్ పరీక్ష సూచనలు వెబ్‌సైట్ ద్వా రా తెలుసుకోవచ్చ ని వెల్లడించారు కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్.
చాలా రోజులుగా టెట్ నిర్వహించకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే.. టెట్ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్‌ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది ఎన్‌సీటీఈ.