ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. నిన్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం ఆగ్నేయ బంగాళాఖాతం… దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంపై వాయుగుండముగా మారి 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ రోజు మార్చి 20వ తేదీన 08 : 30 గంటల IST వద్ద అదే ప్రాంతంలో 10.1°ఉత్తర అక్షాంశానికి మరియు 92.6°తూర్పు రేఖాంశము వద్ద కేద్రీకృతమైవుంది. ఈ వాయుగుండం కార్ నికోబార్ (నికోబార్ దీవులు)కు వాయువ్యంగా 110 కి.మీ దూరములో , పోర్ట్బ్లెయిర్కు కు(అండమాన్ దీవులు) దక్షిణంగా 170 కి.మీ.దూరములో మరియు యాంగోన్ (మయన్మార్)కి నైరుతి దిశలో 840 కి.మీ.ఉన్నది.
అండమాన్ & నికోబార్ దీవుల వెంబడి & వెలుపల ఇది దాదాపు ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది . రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండముగా మరియు తదుపరి 12 గంటలలో తుఫానుగా మారుతుంది. దిగువ ట్రోపో ఆవరణములో ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ
ఈరోజు, రేపు మరియు ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.