అమెరికాలో పెను విషాదం చోటుచేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థి అమెరికాలో దుర్మరణం చెందాడు. అమెరికాలో ఏపీ యువకుడు తాజాగా మృతి చెందడం జరిగింది. స్విమ్మింగ్ పూల్ లో పడి… పాటి బండ్ల లోకేష్ అనే యువకుడు.. మృతి చెందినట్లు చెబుతున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా ఇటీవల వెళ్లాడు లోకేష్. కానీ తన తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చి వెళ్లిపోయాడు.

బాపట్ల జిల్లా మర్టూరు కు చెందిన గ్రానైట్ వ్యాపారి కుమారుడిగా లోకేష్ ను గుర్తించారు. ఇక ఈ సంఘటన తెలియడంతో ఆ గ్రానైట్ వ్యాపారి ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. అమెరికా నుంచి లొకేషన్ మృతదేహాన్ని ఇండియాకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులతో పాటు సంఘంలోని తెలుగు అసోసియేషన్లు కూడా కుటుంబానికి సహాయపడేందుకు ముందుకొచ్చాయి.