తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ నుంచి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 59,834 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,628 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

మెట్ల మార్గాన వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. మొన్నటి వరకు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగింది. వర్షాలు తగ్గడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వెళ్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేకమైన చర్యలను చేపడుతున్నారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు నీటి సదుపాయం, భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు.