ఏపీ సీఎం వైఎస్ జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్ అందివ్వనున్నారు. మామూలుగా రేషన్ లో అందించే నాణ్యమైన బియ్యం సహా నిత్యావసరాలను ఇంటి వద్దే ఇక నుండి డెలివరీ చేయనుంది ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం.ఈ మేరకు ప్రభుత్వం 9260 వాహానాలను సిద్దం చేసినట్టు సమాచారం. ఇప్పటికే టాటా, సుజుకి సంస్థల ద్వారా డోర్ డెలివరీ ట్రక్కుల కొనుగోళ్లు చేసినట్టు చెబుతున్నారు.
ఈ డెలివరి ట్రక్కులోనే కాటా పెట్టి ఇళ్ల వద్దే రేషన్ పంపిణీ చేయనున్నారు. ట్రక్కులో ఒక ఫ్యాన్, ఫైర్ ఎక్సటింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచనున్నారు. ఎనౌన్సమెంట్ కోసం మైక్ సిస్టం కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. సబ్సిడీ ద్వారా డోర్ డెలివరీ వాహానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించినట్టు చెబుతున్నారు. ఇక కొన్ని చోట్ల అద్దె ప్రాతిపదికన కూడా వీటిని తీసుకోనున్నట్టు తెలుస్తోంది.