ఏపీలో కట్టెలు కొట్టిన మహిళ మేయర్‌, కూరగాయలు అమ్మే వ్యక్తీ చైర్ పర్సన్ !

-

ఏపీలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అధిక స్థానాలు గెలుచుకున్న సంగతి తెల్సిందే. అయితే ఆ పార్టీ తరఫున ఎంపిక చేసిన కొందరు మేయర్, చైర్ పర్సన్ ల గురించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అదేమంటే చిత్తూరు కార్పొరేషన్‌ నూతన మేయర్‌గా ఎన్నికైన అముద ఒకప్పుడు కుటుంబం గడవడం కోసం అముద కట్టెలు కొట్టి అమ్మిందట. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిర పడుతున్న క్రమంలో ఈ ఎన్నికల రూపంలో ఆమెకు అదృష్టం వరించింది. వైసీపీ తరఫున కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమేగాక ఇప్పుడు ఏకంగా చిత్తూరు మేయర్‌గా ఎన్నికైంది.

ఇక మరో పక్క  ఓ కూరగాయల వ్యాపారికి కూడా చైర్ పర్సన్ పదవి అందించారు. రాయచోటి  చైర్ పర్సన్ గా కూరగాయలు అమ్మేవ్యక్తిని ఎన్నుకుని.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. రాయచోటికి చెందిన షేక్‌ బాష అనే వ్యక్తి డిగ్రీవరకు చదువుకున్నారు. అయితే ఆయన చదువుకున్న చదువుకు మంచి ఉద్యోగం రాకపోవడంతో ఉద్యోగాలు చేయడం ఇష్టం లేక.. కుటుంబ పోషణ కోసం. తన గ్రామంలో ఒక కూరగాయలు షాపు పెట్టుకుని.. వాటిని అమ్ముతూ జీవిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బాషాకు వైసీపీ కౌన్సిలర్‌ టికెట్‌ కేటాయించింది. అలా చివరికి చైర్ పర్సన్ గా కూడా మారారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version