ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియా పై చేసిన వ్యాఖ్యలపై దుమారం రాష్ట్రంలో ఇంకా తగ్గడం లేదు. తాజా గా తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా మోడీ పార్లమెంట్ లో మాట్లాడితే.. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డలు కాదా అని ప్రశ్నించారు. మోడీ చేత తెలంగాణ రాష్ట్ర సమాజానికి క్షమాపణలను సంజయ్,
కిషన్ రెడ్డి చెప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నో కళను కోట్లాడి తెచ్చుకున్నామని అన్నారు. రాష్ట్రాన్ని అవమానించినట్టు మాట్లాడితే సహించమని తెల్చి చెప్పారు. తెలంగాణ సమాజం బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బీజేపీ విధానం చూస్తే.. తెలంగాణను తిరిగి ఏపీ లో కలిపేసే విధంగా ఉన్నారని మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే ప్రశ్నిస్తున్న బీజేపీ తెలంగాణలో అవసరమా అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఈర్షతోనే మోడీ, అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.