ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ డేస్ సేల్‌.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ఐఫోన్లు..!

-

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న సైట్‌లో యాపిల్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా వినియోగ‌దారులు ఐఫోన్ ఎస్ఈ 2020, ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఐఫోన్ ఎస్ఈ 2020ని యాపిల్ విడుద‌ల చేయ‌గా.. ప్ర‌స్తుతం ఈ ఫోన్‌ను చాలా త‌గ్గింపు ధ‌ర‌కే వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఐఫోన్ ఎస్ఈ 2020లో యాపిల్ ఎ13 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ బ‌డ్జెట్ ఫ్రెండ్లీగా ఇప్ప‌టికే అందుబాటులో ఉంది. ఐఫోన్ ఎక్ఆర్ ను 2018 సెప్టెంబ‌ర్ నెల‌లో లాంచ్ చేయ‌గా.. ఆ ఫోన్ కూడా ఇప్పుడు తగ్గింపు ధ‌ర‌కే ల‌భిస్తోంది. కాగా ఐఫోన్ ఎస్ఈ 2020కి చెందిన 64జీబీ వేరియెంట్‌ను ప్ర‌స్తుతం రూ.35,999కే కొన‌వ‌చ్చు. ఇదే ఫోన్‌కు చెందిన 128 జీబీ వేరియెంట్ ను రూ.40,999 ధ‌ర‌కు, 256జీబీ మోడ‌ల్‌ను రూ.50,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు.

ఐఫోన్ ఎస్ఈని లాంచ్ చేసిన‌ప్పుడు దాని ఎంట్రీ లెవ‌ల్ మోడ‌ల్ ధ‌ర రూ.42,500గా ఉండేది. ఇక ఈ ఫోన్‌పై గ‌రిష్టంగా రూ.13,450 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే నెల‌కు రూ.5,667 చొప్పున నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

ఐఫోన్ ఎక్స్ఆర్‌కు చెందిన 64జీబీ వేరియెంట్‌ను ప్ర‌స్తుతం రూ.45,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. 128జీబీ వేరియెంట్ రూ.51,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. దీనిపై కూడా నెల‌కు రూ.5,111 చొప్పున నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా ఐఫోన్ 11కు చెందిన 64జీబీ మోడ‌ల్‌ను రూ.63,300కి కొన‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో రూ.5వేల వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్‌తో లేక‌పోతే ఈ ఫోన్ ధ‌ర రూ.68,300గా ఉంటుంది. దీనిపై నెల‌కు రూ.7,589 చొప్పున నో కాస్ట్ ఈఎంఐని అందిస్తున్నారు. కాగా ఈ సేల్ ఈనెల 25వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version