టెక్ దిగ్గజ సంస్థ యాపిల్.. ఐఫోన్ ఎస్ఈ సిరీస్‌లో రెండు ఫోన్లను లాంచ్ చేసిన విషయం విదితమే. ఆ ఫోన్లకు యూజర్ల నుంచి మంచి స్పందనే లభించింది. ఈ క్రమంలోనే యాపిల్ ఇదే సిరీస్‌లో ఇంకో ఫోన్‌ను లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 3 (IPhone SE3 ) పేరిట ఓ ఫోన్‌ను లాంచ్ చేస్తుందని తెలిసింది. ఇక అందులో 5జి సపోర్ట్‌ను అందిస్తుందని తెలుస్తోంది.
ఐఫోన్ ఎస్ఈ3ని యాపిల్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయనుందని తెలుస్తోంది. అందులో యాపిల్ ఎ14 బయానిక్ ప్రాసెసర్, 5జి, టచ్ ఐడీ సెన్సార్, 4.7 ఇంచుల డిస్‌ప్లే వంటి ఫీచర్లను అందించనుందని సమాచారం. ఇక సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లను యాపిల్ లాంచ్ చేస్తుందని తెలుస్తోంది.
అయితే 2023లో లాంచ్ చేయనున్న ఐఫోన్ ఎస్ఈలో మాత్రం 6 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఫేస్ ఐడీ వంటి ఫీచర్లను యాపిల్ అందిస్తుందని తెలుస్తోంది. ఇక త్వరలోనే ఐఓఎస్ 15ను కూడా యాపిల్ అందుబాటులోకి తేనుంది. కాగా ఐఫోన్ ఎస్ఈ3 ఫోన్ ధర 399 డాలర్లు (దాదాపుగా రూ.29వేలు) ఉంటుందని తెలుస్తోంది.