భార‌త్‌లో స్వ‌యంగా ప్రొడ‌క్ట్స్ అమ్మ‌నున్న యాపిల్‌.. సెప్టెంబ‌ర్ నుంచి ఆన్‌లైన్ స్టోర్‌..

-

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ యాపిల్ భార‌త్‌లోని యాపిల్ ప్రియుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక‌పై ఆ కంపెనీ ఏజెన్సీల స‌హాయం లేకుండానే సొంతంగా త‌న‌కు తానే త‌న ప్రొడ‌క్ట్స్‌ను భార‌త్‌లో విక్ర‌యించ‌నుంది. ఈ మేర‌కు యాపిల్ భార‌త్‌లో ప్ర‌త్యేకంగా ఆన్‌లైన్ స్టోర్‌ను ఏర్పాటు చేయ‌నుంది. సెప్టెంబ‌ర్ నుంచి ఈ స్టోర్ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌స్తుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో యాపిల్ ఇత‌ర ఏజెన్సీల ద్వారా త‌న ఉత్ప‌త్తుల‌ను అమ్ముతూ వ‌చ్చింది. అయితే కేంద్రం ఇటీవ‌ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్డీఐ) నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించ‌డంతో యాపిల్‌కు మార్గం సుగ‌మం అయింది. దీంతో ఆ కంపెనీ ఇత‌ర ఏజెన్సీల‌తో సంబంధం లేకుండా నేరుగా త‌న ప్రొడ‌క్ట్స్‌ను భార‌త్‌లో విక్ర‌యించ‌నుంది.

అయితే 2021లో ముంబైలో మొద‌టి ఫిజిక‌ల్ స్టోర్‌ను, త‌రువాత బెంగ‌ళూరులో రెండో ఫిజిక‌ల్ స్టోర్‌ను కూడా యాపిల్ ఓపెన్ చేయాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే అనేక కంపెనీలు త‌మ సొంత ఆన్‌లైన్‌, ఫిజిక‌ల్ స్టోర్‌ల‌ను భార‌త్‌లో ఏర్పాటు చేసి త‌మ త‌మ డివైస్‌ల‌ను విక్ర‌యిస్తున్నాయి. కానీ యాపిల్ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నే దేశంలో త‌న స్టోర్‌ల‌ను ఏ రూపంలోనూ ఏర్పాటు చేయ‌లేదు. అయితే ముందుగా ఆన్‌లైన్‌, త‌రువాత ఫిజిక‌ల్ స్టోర్‌లు రానుండ‌డంతో వినియోగదారులు త‌మ ఫేవ‌రెట్ యాపిల్ ప్రొడ‌క్ట్స్ ను మ‌రింత సుల‌భంగా కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version